![]() |
![]() |

నిజంగా ఫుడ్ రివెంజ్ అనేది కొత్త మాట. రివెంజ్ అంటేనే ప్రతీకారం కదా. మరి అలాంటి ఫుడ్ మనుషుల మీద ఎలా రివెంజ్ తీర్చుకుంటుంది అనుకుంటున్నారు కదా. తీర్చుకుంటుంది. అదేంటో చూద్దాం.
బ్రహ్మముడి కావ్య తెలుసు కదా మీ అందరికీ. చాలా చబ్బీగా బుగ్గల బూరెలతో అందంగా, క్యూట్ గా ఉంటుంది. అలాంటి కావ్య అలియాస్ దీపికా రంగరాజు ఒక కొత్త కాన్సెప్ట్ ని కనిపెట్టింది. రీసెంట్ గా ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. బ్రహ్మముడి సీరియల్ లో రుద్రాణి అలియాస్ షర్మిత ఫుడ్ ని తెచ్చుకుని తింటూ వాటర్ తాగుతూ ఉన్న వీడియో అది.
ఇక కావ్య ఆమె పక్కకు వెళ్లి "షర్మిత అక్కా మీరొక్కరే ఇంత ఫుడ్ ని ఆర్డర్ చేసుకుని తింటున్నారు. ఐనా కూడా మీరు ఎలా ఇలా సన్నగా ఉన్నారు..మన ఆడియన్స్ కి చెప్పండి" అని అడిగింది. దాంతో షర్మిత "ముందు నువ్వు దిష్టి పెట్టొద్దు" అని షర్మిత అనేసరికి "సరే సన్నగా ఉండడానికి సీక్రెట్ చెప్పు అని అడిగింది. " ఐతే ముందు నేను ఫుడ్ వేస్ట్ చేయను..అలాగే జెనెటికల్లీ ఎంత తిన్నా సన్నగానే ఉంటా..హైదరాబాద్ నుంచి బెంగుళూరు..బెంగుళూరు నుంచి హైదరాబాద్ ట్రావెల్ చేస్తూ ఉంటా " అని చెప్పింది.
దాంతో కావ్య కూడా "నేను చెన్నై నుంచి హైదరాబాద్..హైదరాబాద్ తో చెన్నై వెళ్తున్నా..వర్కౌట్స్ చేస్తున్నా..జిమ్ చేస్తున్నా...ఐనా చబ్బీగానే ఉంటున్నా. ఐతే ఫుడ్ ని వేస్ట్ చేయకుండా ఉంటె ఫుడ్ మన మీద రివెంజ్ తీర్చుకోకుండా వెయిట్ లాస్ లో ఉంచేలా చూస్తుంది. నేను ఫుడ్ ని ఎక్కువగా వేస్ట్ చేస్తున్న కాబట్టి ఎక్కువగా నా మీద రివెంజ్ తీర్చుకుంటూ నన్ను బాగా చబ్బీగా, వెయిట్ గెయిన్ చేసేస్తోంది. ఫుడ్ ని లైట్ గా స్మెల్ చేస్తేనే నేను చబ్బీ ఐపోతున్నా. అందుకే నేను ఫుడ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్ లో ఉన్నాం ..." అంటూ కామెడీ చేస్తూ బైబై చెప్పేసింది.
ఇక నెటిజన్స్ ఐతే "కావ్య నువ్వు చబ్బీ గానే బాగుంటావు..ఇలాంటి బ్రిలియంట్ థాట్స్ అసలు నీకు ఎలా వస్తాయి" అని కామెంట్స్ చేస్తున్నారు.
.webp)
![]() |
![]() |